
శివరాత్రికి రిలీజైన సినిమాల్లో జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అయ్యింది. అనుదీప్ డైరక్షన్ లో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్ధుల్లా హీరోయిన్ గా నటించింది. సినిమా టైటిల్స్ దగ్గర నుండి ఎండ్ కార్డ్ వరకు ఆడియెన్స్ ను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుని చేసిన ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో చిట్టి హీరో హీరోయిన్ ను ముద్దుగా పిలిచుకునే పేరు చిట్టి పాత్రలో ఫరియా కూడా మొదటి సినిమానే అయినా మెప్పించింది.
అందుకే సినిమా హిట్టు పడ్డదో లేదో అమ్మడికి అవకాశాలు వచ్చేస్తున్నాయి. ఒకటి రెండు కథలు డిస్కషన్స్ లో ఉండగా లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజతో ఫరియా అబ్ధుల్లా ఛాన్స్ అందుకుందని టాక్. రవితేజ, నక్కిన త్రినాథ రావు కాంబోలో వస్తున్న సినిమాలో ఫరియా ఫీమేల్ లీడ్ గా సెలెక్ట్ అయ్యిందట. క్రాక్ తో హిట్ ఫాం లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో సినిమా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. తప్పకుండా ఫరియాకు ఈ సినిమా ఆఫర్ రావడం లక్కీ అని చెప్పొచ్చు.