
ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ సురభి.. శర్వానంద్ తో హిట్ అందుకున్నా ఆ తర్వాత నానితో చేసిన జెంటిల్ మెన్ సినిమాతో మెప్పించినా అమ్మడికి అవకాశాలు పెద్దగా రాలేదు. సినిమాలైతే చేస్తున్నా క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డది సురభి. ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న శశి సినిమాలో హీరోయిన్ గా నటించింది అమ్మడు. ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని.. రెండు షేడ్స్ ఉన్న ఈ పాత్రలో ప్రీ క్లైమాక్స్ లో తన నటన అందరిని ఆకట్టుకుంటుందని చెబుతుంది.
ఇప్పటివరకు తనకు వచ్చినవి రెగ్యులర్ పాత్రలే అని.. గ్లామర్ రోల్స్ కూడా చేసేందుకు రాను సిద్ధమే అని హింట్ ఇచ్చింది సురభి. ఆమధ్య వెబ్ సీరీస్, ఓటిటి ఆఫర్లు వచ్చినా నటనకు ప్రాధాన్యత లేని పాత్రలని వాటిని కాదన్నానని అన్నది. ఛాన్స్ వస్తే తన గ్లామర్ షో కూడా చేసేందుకు రెడీ అన్నట్టు చెప్పుకొచ్చింది సురభి. సో అవకాశాలు లేనప్పుడు స్కిన్ తో అయినా ఆకట్టుకోవాలని అమ్మడికి ఇప్పుడు తెలిసి వచ్చింది కాబోలు. మరి సురభి ఇస్తున్న ఈ అవకాశాన్ని ఏ డైరక్టర్ వాడుకుంటాడో చూడాలి.