జాతిరత్నాలు అనుదీప్ తో ఇస్మార్ట్ హీరో..!

రీసెంట్ గా రిలీజైన జాతిరత్నాలు సినిమాను డైరెక్ట్ చేసిన అనుదీప్ నిజమైన జాతిరత్నం అని సినిమా చూసిన వారు చెబుతున్నారు. సినిమాలో పెద్దగా కథ లేకపోయినా సరే తన రైటింగ్ స్కిల్స్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు అనుదీప్. జాతిరత్నాలు రిలీజ్ కు ముందు సుమ క్యాష్ ప్రోగ్రాం కు వెళ్లి అక్కడ నవ్వులు పండించి అనుదీప్ కాస్త క్యాష్ అనుదీప్ గా మారాడు. సినిమా హిట్ లో భాగంగా కాస్టింగ్ తో పాటుగా క్యాష్ అనుదీప్ కు ప్రశంసలు అందుతున్నాయి.

జాతిరత్నాలు లాంటి క్రేజీ హిట్ అందుకున్న ఈ డైరక్టర్ తన నెక్స్ట్ సినిమా కథ రెడీ చేసుకున్నాడట. ఇంతకీ ఈ డైరక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడో తెలుసా.. ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న రామ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరక్టర్ లింగుసామితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనుదీప్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ అనుదీప్ రాం ను కలిసి కథ చెప్పడం.. రామ్ ఓకే చేయడం జరిగిందని తెలుస్తుంది. మొత్తానికి జాతిరత్నాలు తర్వాత అనుదీప్ రామ్ తో సినిమా ఫిక్స్ అయినట్టే లెక్క.