శంకర్ సినిమాకు మ్యూజిక్ ఎవరు..?

సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారని తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన క్రేజీ అప్డేట్ వస్తుందని అంటున్నారు. మార్చ్ 27 చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి డీటైల్స్ వెళ్లడిస్తారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించడానికి సిద్ధమవుతున్నాడు ఎస్.ఎస్ థమన్. మాములుగా శంకర్ సినిమా అంటే అతనితో పాతు రెహమాన్ కూడా వస్తాడు. వాళ్లిద్దరిది సూపర్ కాంబో అని ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. అయితే ఈసారి శంకర్ రెహమాన్ ను పక్కన పెట్టి థమన్ తో ప్రయత్నించాలని చూస్తున్నారట. దిల్ రాజు కూడా థమన్ అయితే బెటర్ అన్నట్టు చెప్పారట. సో థమన్ ఈ ప్రాజెక్ట్ కన్ఫాం అయితే అతని కెరియర్ లో మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే అవుతుంది. ఆల్రెడీ తెలుగు, తమిళ భాషల్లో తన మ్యూజిక్ తో అలరిస్తున్న థమన్ ఈసారి నేషనల్ వైడ్ గా తన సత్తా చాటనున్నాడని తెలుస్తుంది.