
స్టార్ డైరక్టర్ గా ఓ పక్క క్రేజీ సినిమాలు చేస్తూనే తన దగ్గర ఉన్న టాలెంటెడ్ పీపుల్ కు అవకాశాలు ఇస్తుంటాడు సుకుమార్. తన అసిస్టెంట్ లకు డైరక్షన్ ఛాన్సులు ఇస్తూ.. వారి దగ్గర కథ ఉంటే ఓకే లేదంటే అతనే కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ సినిమా చేస్తుంటాడు. కుమారి 21ఎఫ్, దర్శకుడు, ఉప్పెన అలా వచ్చిన సినిమాలే. కుమారి 21ఎఫ్ సూపర్ హిట్ కాగా.. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ సినిమాను కూడా సుకుమార్ కథతోనే వస్తుంది. కుమారి డైరక్టర్ సూర్య ప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా కార్తికేయతో సుకుమార్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆరెక్స్ 100 సినిమాతో టాలెంట్ చూపించిన కార్తికేయ తన పంథాలో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. లేటెస్ట్ గా అతను హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో చావు కబురు చల్లగా సినిమా వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే సినిమా కార్తికేయకు హిట్ పక్కా అనేలా ఉంది. ఇక సుకుమార్ కూడా కార్తికేయకు ఓ ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కార్తికేయ కోసం సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు.. నిర్మాతలు ఎవరన్నది మాత్రం ఇంకా వెళ్లడించలేదు. ఏది ఏమైనా కార్తికేయకు మాత్రం ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.