వైల్డ్ డాగ్ ట్రైలర్.. వావ్ అనిపించిన నాగార్జున..!

కింగ్ నాగార్జున హీరోగా సోలమన్ డైరక్షన్ లో వస్తున్న యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. హైదరాబాద్ గోకుల్ చాట్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున ఎన్.ఐ.ఏ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. 60 ఏళ్ల వయసులో కూడా నాగార్జున ఎవర్ గ్రీన్ ఛార్మింగ్.. ఎనర్జీతో కనిపిస్తున్నారు. 2 నిమిషాల ట్రైలర్ తోనే ఆడియెన్స్ ను ఎంగేజ్ అయ్యేలా చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని చెప్పొచ్చు. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ లానే సినిమా ఉంటే మాత్రం నాగార్జున కెరియర్ లో మరో సూపర్ హిట్ పడినట్టే లెక్క. ముందు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని ఇది ఓటిటిలో రిలీజ్ అయ్యే సినిమా కాదు థియేటర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అని చిత్రయూనిట్ ఫిక్స్ అయ్యారు. ఆఫీసర్, మన్మథుడు 2 సినిమాల ఫ్లాప్ తర్వాత నాగ్ చేస్తున్న ఈ వైల్డ్ డాగ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు.