
అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా లాంటి బ్లాక్ బస్టర్ అందించిన కళ్యాణ్ కృష్ణ డైరక్షన్లో రాబోతున్న సినిమాలో లావణ్య త్రిపాఠి కూడా ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లావణ్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ జెనరేషన్ లో తండ్రి కొడుకులిద్దరితో నటిస్తున్న హీరోయిన్ గా ఈతరం శ్రీదేవి అంటూ హడావిడి చేశారు మీడియా వాళ్లు. అయితే లావణ్య దగ్గర ఈ సినిమా గురించి ప్రస్తావిస్తే  మాత్రం తాను ఆ సినిమాలో లేను.. టీం అందరికి ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేసింది.
నాగ చైతన్యతో లావణ్య క్రేజీ కాంబినేషన్ అంటూ సంబరపడిన అక్కినేని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది లావణ్య. అయితే ఆమె ట్వీట్ కు పాజిటివ్ గా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ కూడా స్పందించి 'థాంక్స్ లావణ్య.. నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు ఆల్ ది బెస్ట్ త్వరలోనే మనం కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా' అంటూ రీ ట్వీట్ చేశాడు. సోగ్గాడు హిట్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన కళ్యాణ్ కృష్ణ చైతూకి అదే రేంజ్ హిట్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక ఈ సినిమా టైటిల్ కూడా 'ఒకసారి ఇటు చూడవే' అని పెట్టబోతున్నారట. ఈ ఇయర్ లో ప్రేమం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చైతు సినిమా హిట్ మీద నమ్మకంతో ఉన్నాడు. ఇక గౌతమ్ మీనన్ తో చేసిన సాహసం శ్వాసగా సాగిపో కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది.