
కింగ్ నాగార్జున , కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్నినాయన. ఈ సినిమా సక్సెస్ అవడంతో ఆ టైం లోనే సినిమాకు సీక్వల్ ప్లాన్ చేశారు. సినిమాలోని నాగార్జున పాత్ర బంగార్రాజునే సినిమా టైటిల్ గా అనుకున్నారు. అయితే కళ్యాణ్ కృష్ణ ఆ తర్వాత నేల టిక్కెట్ అనే సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున కూడా వేరే సినిమాలతో బిజీ అవడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది.
ఇక లేటెస్ట్ గా నాగార్జున మరోసారి బంగార్రాజు ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడని తెలుస్తుంది. ప్రస్తుతం సోలమన్ డైరక్షన్ లో వస్తున్న వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న రిలీజ్ ప్లాన్ చేయగా ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు కింగ్ నాగార్జున. ఇక ఈ సినిమాతో పాటుగా బంగార్రాజు సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో భూమికని హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలుస్తుంది. మహేష్, ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ తో నటించిన భూమిక ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తుంది. నాగ్ సినిమాలో భూమిక ఎలా అలరిస్తుందో చూడాలి.