ఏక్ మిని కథ.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

ఓ పక్క వందల కోట్ల బడ్జెట్ తో స్టార్ సినిమాలు వస్తున్నా.. తెలుగు ఆడియెన్స్ మాత్రం తక్కువ బడ్జెట్ తో వచ్చే సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. కోట్ల బడ్జెట్ కాదు కంటెంట్ ఎలా ఉంది అన్నది ఆడియెన్స్ చూస్తున్నారు. అలాంటి చిన్న ప్రయత్నాలను ముందుండి ఎంకరేజ్ చేస్తున్నారు తెలుగు ఆడియెన్స్. ఈమధ్య ఇదే తరహాలో మంచి కథతో సినిమాలు వస్తుండగా అదే తరహా కథలతో వస్తున్న మరో సినిమా ఏక్ మిని కథ.

దివంగత దర్శకుడు శోభన్ తనయుడు  సంతోష్ శోభన్ హీరో గా యువి కాన్సెప్ట్స్ చేస్తున్న సినిమా ఇది. తను నేను, పేపర్ బోయ్ సినిమాల్లో హీరోగా చేసిన సంతోష్ శోభన్ ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఏక్ మిని కథ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ అప్డేట్ చెబుతూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. రాధే శ్యాం నిర్మాతలు యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ ఏక్ మిని కథ సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుందని మాత్రం అర్ధమవుతుంది. ఏక్ మిని కథ.. డస్ సైజ్ మ్యాటర్ అంటూ పోస్టర్ తోనే ఆసక్తి కలిగేలా చేశారు చిత్రయూనిట్.