
సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా నిలబడేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రేమకావాలి సినిమాతో మొదలైన ఆది కెరియర్ 10 ఏళ్లలో 13 సినిమాలు చేశాడు. లేటెస్ట్ గా శశి సినిమాతో వస్తున్నాడు ఆది. ఈ సినిమాను శ్రీనివాస్ నాయుడు డైరెక్ట్ చేశారు. శశి సినిమాలో ఆది సాయి కుమార్ కు జోడీగా సురభి నటించింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు.
మార్చ్ 19న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు తన బెస్ట్ విషెస్ అందించారు పవన్ కళ్యాణ్. ట్రైలర్ విషయానికి వస్తే కొత్త కాన్సెప్ట్ ఏమి కాదు కాని సాయి కుమార్ డిఫరెంట్ గా ట్రై చేసినట్టు ఉన్నాడని అనిపిస్తుంది. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని అవేవి ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోవట్లేదు. మరి ఈ శశి సినిమాతో అయినా ఆది హిట్టు కొడతాడో లేదో చూడాలి.