
వరుస సినిమాలతో సూపర్ ఫాం లో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సెట్స్ మీద ఉన్న రాధే శ్యాం రిలీజ్ ఫిక్స్ చేయగా.. తర్వాత చేస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాలు కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. సలార్ సినిమా 2022 ఏప్రిల్ 14న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. ఇక బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ డైరక్షన్ లో ప్రభాస్ చేస్తున్న క్రేజీ మూవీ ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటించనున్నాడు.
టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడైతే సీత పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. రోజుకొక హీరోయిన్ పేరు వినిపిస్తుండగా.. ఫైనల్ గా చిత్రయూనిట్ ఆదిపురుష్ సీత పాత్రకి మహానటి కీర్తి సురేష్ ను కన్ ఫాం చేసినట్టు తెలుస్తుంది. మహానటి సినిమాతో తన ప్రతిభ చాటుకుని నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది కీర్తి సురేష్. ఆదిపురుష్ లో సీత పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అని అంటున్నారు.