
RRR, ఆచార్య సినిమాలు చేస్తున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా శంకర్ డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. సౌత్ డైరక్టర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న శంకర్ రోబో సీక్వల్ గా వచ్చిన 2.ఓతో ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత చరణ్ తోనే శంకర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న కియరా అద్వాని తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేను, చరణ్ తో వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు వచ్చినా బీ టౌన్ లో బిజీ అవడంతో అమ్మడు ఇక్కడ సినిమాలు చేయలేదు. అయితే శంకర్, చరణ్ కాంబో సినిమాకు మాత్రం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమా కోసం అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్.