
కె.జి.ఎఫ్ సినిమాతో సౌత్ లోనే కాదు నేషనల్ వైడ్ గా తన సత్తా చాటాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో యశ్ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కె.జి.ఎఫ్ పార్ట్ 1 అదరగొట్టగా ఇక రాబోతున్న చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈమధ్యనే వచ్చిన కె.జి.ఎఫ్ 2 టీజర్ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఏర్పరచింది. ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ పార్ట్ 2తో కూడా సంచలనాలు సృష్టించడం పక్కా అని తెలుస్తుంది.
ఇక కె.జి.ఎఫ్ పార్ట్ 2 తర్వతా ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా కూడా ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఫిక్స్ చేసుకున్నాడు. తారక్ తర్వాత ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమా కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్నాడని టాక్. ఈమధ్యనే అల్లు అర్జున్ ను ప్రశాంత్ నీల్ కలిశారట. వీళ్లిద్దరి కలయిక సినిమా కోసమే అని ఫిల్మ్ నగర్ టాక్. ఏదైమైనా కన్నడ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగు హీరోలతో వరుస సినిమాలు చేయడం తెలుగు ఆడియెన్స్ ఖుషి అవుతున్నారు.