
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా దువ్వాడ జగన్నాథం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవనుంది. ఈ ఇయర్ సమ్మర్లో సరైనోడుతో తన స్టామినా ఏంటో మరోసారి రుచి చూపించిన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం అనే టైటిల్ తోనే ఓ క్రేజ్ సంపాదించాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా అప్పట్లో పూజా హెగ్డే ని అనుకోగా అమ్మడు మొహెంజోదారో మోజులో పడి కాదనేసింది.
ఇక ఆ సినిమా ఎప్పుడైతే పోయిందో మళ్లీ తెలుగు సినిమాల మీద కన్నేసింది పూజా. తనంతట తానే దర్శక నిర్మాతలకు ఫోన్ చేసి మరీ సినిమా చేస్తా అంటూ వెంటపడిందట. ఇక పూజా కాదని చెప్పడంతో కాజల్ తో సరిపెట్టుకోవాలని చూసిన చిత్రయూనిట్ మళ్లీ ఆమె ఓకే చెప్పడంతో ఫైనల్ గా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. సో మొత్తానికి స్టైలిష్ స్టార్ తో జోడి కట్టే లక్కీ ఛాన్స్ పూజా హెగ్డే దక్కించుకుందన్నమట.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాపులవుతున్న ఈ సందర్భంలో రాక రాక వచ్చిన స్టార్ సినిమా ఇది. కాబట్టి సినిమాలో పూజా అడ్డు అదుపు లేకుండా ఎలాంటి సీన్లకైనా సరే నో చెప్పకుండా చేస్తుందని టాక్. మరి అమ్మడి అదృష్టం ఎలా ఉండబోతుందో ఈ సినిమా ఫలితాన్ని బట్టి చెప్పేయొచ్చు.