శర్వానంద్ శ్రీకారం బిజినెస్ ఎంతంటే..!

యువ హీరో శర్వానంద్ 2017లో వచ్చిన మహానుభావుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు కాని హిట్టు మాత్రం దక్కట్లేదు. లేటెస్ట్ గా శర్వానంద్ హీరోగా కిశోర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీకారం. మార్చ్ 11న శివరాత్రి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. శర్వానంద్ సరసన నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ నటించిన ఈ సినిమాకు మిక్కి జె మేయర్ మ్యూజిక్ అందించాడు.  

రిజల్ట్ తో సంబంధం లేకుండా శర్వానంద్ సినిమాల బిజినెస్ జరుగుతుంది. శ్రీకారం సినిమా కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో 16.1 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. నైజాం 5.7 కోట్లు, సీడెడ్ 2.4 కోట్లు ఆంధ్రా 8 కోట్లు కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల పైన బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో సోమవారం ప్లాన్ చేశారు. ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్ లో శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు.