
టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు నాచురల్ స్టార్ నాని. అతను హీరోగా సినిమా చేస్తున్నాడు అంటే కామన్ ఆడియెన్స్ కూడా ఎక్సయిట్ అవుతారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా నాని కెరియర్ దూసుకెళ్తుంది. ప్రస్తుతం నాని శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందిచిన టీజర్ రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత నాని రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలతో నాని తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా నాని రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. ప్రస్తుతం నానితో సినిమా చేయాలంటే 14 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఇదివరకు సింగిల్ డిజిట్ ఉన్నా క్రేజ్, డిమాండ్ పెరగడంతో నాని కూడా తన రెమ్యునరేషన్ పెంచేశాడని తెలుస్తుంది.