
సౌత్ సిని పరిశ్రమలో సూర్య, కార్తి ఇద్దరు మేటి నటులుగా క్రేజ్ సంపాదిస్తున్నారు. సూర్య తన విలక్షణ నటనతో ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంటుంటే, కార్తి సహజ నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఇద్దరు ఇద్దరి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంటే వారి సినిమాల ఫలితాలు కూడా అదే రేంజ్లో దర్శక నిర్మాతలకు లాభాల బాట పట్టిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సూర్య సింగం-3 చేస్తుండగా కార్తి కాష్మోరా సినిమాతో రాబోతున్నాడు.
అయితే ముందు నుండి దీపావళికి టార్గెట్ పెట్టుకున్న సూర్య ఎస్-3 ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ను డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేస్తున్నాడట. దాని కారణం తమ్ముడి కార్తి కాష్మోరా సినిమా అంటున్నారు. ఇప్పటికే ఎస్-3 పూర్తి అయ్యింది కాని కార్తి కోసమే ఆ సినిమా రిలీజ్ ను ఆపుతున్నారట. కోలీవుడ్లో దసరా కన్నా దీపావళి టార్గెట్ చేసుకుని స్టార్స్ తమ సినిమాలను రిలీజ్ చేస్తారు కాని తమ్ముడి కోసం దీపావళిని విడిచి క్రిస్మస్ కు తన సినిమా రిలీజ్ చేస్తున్నాడట సూర్య ఎస్-3.
సూర్య ఎస్-3లో శృతి హాసన్, అనుష్క నటిస్తుండగా.. కాష్మోరాలో నయనతార, శ్రీదివ్య హీరోయిన్స్ గా చేస్తున్నారు. రెండు సినిమాలతో ఇద్దరు అన్నదమ్ములు కోలీవుడ్లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. 24 హిట్ తో సూర్య, ఊపిరి రిజల్ట్ తో కార్తి అందరి అంచనాలను చేరుకోగా రాబోతున్న సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.