
హిట్ కొడితే రెమ్యునరేషన్ పెంచేయడం తెలిసిన విషయమే.. ఇక ఓ పక్క నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూ దర్శకుడిగా కూడా క్రేజ్ సంపాదించిన అవసరాల శ్రీనివాస్ రీసెంట్ గా జ్యో అచ్యుతానంద మూవీ హిట్ తో తన ప్రతిభ చాటుకున్నాడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ ఆ సినిమాకు 15 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక ఆ హిట్ తో రెండో సినిమాకు దాదాపు 60 లక్షల పారితోషికం దాకా తీసుకున్నాడట.
సెకండ్ మూవీ కూడా సూపర్ హిట్ కొట్టేయడంతో తన మూడో సినిమాకు ఏకంగా రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. అవసరలా అడిగే రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారట నిర్మాతలు. ఇక తను తీసిన రెండు సినిమాలను నిర్మించిన సాయి కొర్రపాటి తన మూడో సినిమాను నిర్మించబోతున్నాడట. నాని హీరోగా తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయట.
నటుడిగా కోట్లకు పడగలెత్తడం కాస్త టైం పడుతుందేమో కాని దర్శకుడిగా మాత్రం మూడో సినిమాకే రెండున్నర కోట్లను తీసుకుంటున్న డైరక్టర్ గా శ్రీని ఓ సెపరేట్ క్రేజ్ సంపాదించాడు. మరి ఇలానే చేసిన ప్రతి సినిమా హిట్ అందుకుంటే టాలీవుడ్ టాప్ డైరక్టర్స్ లిస్ట్ లో అవసరాల శ్రీనివాస్ కూడా చేరిపోతాడనడంలో సందేహం లేదు. కథ కథనాలతో కొత్తదనంతో ప్రేక్షకులకు ఓ మధురానుభూతిని పంచుతున్న అవసరాల శ్రీనివాస్ ప్రేక్షకులు మెచ్చిన డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.