తెలంగాణా యాస నేర్చుకుంటున్న కృతి శెట్టి..!

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఉప్పెనలో బేబమ్మ పాత్రలో అమ్మడు చూపించిన అభినయం ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సినిమా హిట్ అయినందుకు చెప్పుకునే హైలెట్ అంశాలలో కృతి శెట్టి కూడా ఒకరు. ఈ సినిమా పూర్తయిందో లేదో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నానితో శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేస్తుంది కృతి శెట్టి.

సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కృతి శెట్టి పక్కా హైదరాబాదీ అమ్మాయిగా తెలంగాణా యాసలో మాట్లాడుతుందని తెలుస్తుంది. ఇందుకోసం అమ్మడు తెలంగాణా యాక్సెంట్ నేర్చుకుంటుందట. మొదటి సినిమాకే తెలుగు నేర్చుకున్న కృతి శెట్టి ఇప్పుడు యాస మీద పట్టుసాధించాలని చూస్తుంది. ఆమెలో ఉన్న ఈ పట్టుదలే ఆమెను స్టార్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు.