వైల్డ్ డాగ్ OTT సినిమా కాదు.. అందరి అంచనాలకు తగ్గట్టుగానే..!

కింగ్ నాగార్జున హీరోగా ఊపిరి రైటర్ సోలమన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వైల్డ్ డాగ్. హైదరబాద్ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి రిలీజ్ డేట్.. ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకున్నారు చిత్రయూనిట్. అసలైతే ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేశామని.. నెట్ ఫ్లిక్స్ తో అగ్రిమెంట్ కూడా అయ్యిందని అన్నారు నాగ్.

కరోనా తర్వాత థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుంది. అసలు మళ్లీ థియేటర్లకు వచ్చి ఆడియెన్స్ సినిమా చూస్తారా అన్న డౌట్ ఉండేది. కాని సంక్రాంతి సినిమాలు ఆ డౌట్ క్లియర్ చేశాయి. మంచి సినిమా తీస్తే మేము సినిమాలు చూస్తామని రవితేజ క్రాక్, వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలు ప్రూవ్ చేశాయి. అందుకే వైల్డ్ డాగ్ సినిమా కూడా ఓటిటి రిలీజ్ ను ఆపేసి థియేటర్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.

ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు థియేటర్ లోనే వైల్డ్ డాగ్ రిలీజ్ అవుతుందని చెప్పారు. ఈ సినిమా థియేటర్ ఎక్స్ పీరియన్స్ బాగుంటుందని.. అందరి అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని అన్నారు నాగార్జున. నిర్మాత నిరంజన్ డిఫరెంట్ సినిమాలు ఇలానే చేయాలని అన్నారు. సోలమన్ కు ఈ సినిమాను చాలా బాగా  హ్యాండిల్ చేశారని చెప్పారు. తనతో ఈ సినిమాలో నటించిన అందరు బాగా చేశారని అన్నారు నాగార్జున.