
ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో పెళ్లిచూపులు చాలా ప్రత్యేకం అని చెప్పాలి.. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఎన్నో చోట్ల రికార్డులను సైతం నెలకొల్పింది. అయితే ఈ సినిమా మరో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ.ఎస్ లో 10 సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, ప్రభాస్ ల వల్ల కూడా కాని ఈ రికార్డ్ ఇప్పుడు పెళ్లిచూపులు సొంతమైంది.
తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రాజ్ కందుకూరి నిర్మించారు. అయితే సినిమా మొత్తం కేవలం కోటి లోపల బడ్జెట్ తో నిర్మించగా అది ఈ రేంజ్ హిట్ అవ్వడం గొప్ప విషయం. ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ వసూళ్లతో సంచలనం సృష్టించిన పెళ్లిచూపులు 50 రోజుల పండుగ జరుపుకోవడం విశేషం. ఇక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణం సురేష్ బాబు. రిలీజ్ ముందే ఈ సినిమాను సురేష్ బాబు కొనేశారు.  
తనకున్న నైపుణ్యంతో మంచి సినిమాను ప్రమోట్ చేయాలని అన్ని విధాలుగా సినిమా ప్రమోషన్స్ ఏర్పాటు చేసి ఈ రేంజ్ హిట్ అవ్వడానికి కారణం అయ్యారు.   ఇక ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్లో ఈ సినిమా ఉండబోతుందట. హింది వర్షన్ లో కూడా తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. కాబట్టి ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో పెళ్లిచూపులు మూవీ ఓ కొత్త రికార్డును సృష్టించిందని చెప్పాలి.