
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు వెంట హీరోలు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. సుకుమార్ అసిస్టెంట్ గా ఉంటూ ఉప్పెన సినిమాతో డైరక్టర్ గా మారాడు బుచ్చి బాబు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఉప్పెన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బుచ్చి బాబుతో మరో రెండు సినిమాలు ఫిక్స్ చేసుకున్నారట. డైరక్టర్, నిర్మాతలు ఒకే మరి హీరో ఎవరు అంటే అక్కినేని హీరోతో బుచ్చి బాబు సెకండ్ సినిమా ఉంటుందని టాక్.
అక్కినేని నాగ చైతన్యతో బుచ్చి బాబు సినిమా చర్చలు నడుస్తున్నాయట. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రం కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా కూడా లైన్ లో ఉంది. లవ్ స్టోరీ రిలీజ్ కు రెడీ అవగా విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చే థ్యాంక్ యు సినిమా మాత్రం ఈ ఇయర్ ఎండింగ్ లో వస్తుందని తెలుస్తుంది. త్వరలోనే బుచ్చి బాబు, నాగ చైతన్య కాంబో మూవీ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.