పవన్ 27 టైటిల్ ఫిక్స్..?

క్రిష్ డైరక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమాకు రకరకాల టైటిల్స్ వినపడుతున్నాయి. బందిపోటు, హర హర మహాదేవ్, వీరమల్లు టైటిల్స్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక ఫైనల్ గా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. హర హర వీరమల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ సినిమా టైటిల్ అనుకున్నారట. 

ఈ టైటిల్ ను క్రిష్ రిజిస్టర్ చేయించారని తెలుస్తుంది. 17వ శతాబ్ధం జరిగిన కథతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సినిమాలో పవన్ లుక్, స్టైల్ కొత్తగా ఉంటాయని టాక్. క్రిష్ ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారట. సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శివరాత్రి కానుకగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.