నాని 'శ్యామ్ సింగ రాయ్' లుక్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను నుండి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. బెంగాలీ వ్యక్తిగా నాని కనిపిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమాకు మిక్కి జె మేయర్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ అదిరిపోగా ఈ సినిమాతో నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అనిపిస్తుంది. టాక్సీవాలా సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ సంకృత్యన్ శ్యామ్ సింగ రాయ్ అంటూ నానితో మరో క్రేజీ సినిమా చేస్తున్నారు.