సామ్ జామ్ సర్దేసినట్టేనా..!

అక్కినేని సమంత పెళ్లి తర్వాత కూడా తన సత్తా చాటుతుంది. సినిమాలతోనే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా అమ్మడు తన స్టామినా ప్రూవ్ చేస్తుంది. ఆహా కోసం సమంత సామ్ జామ్ షో చేస్తుంది. ఈ షోకి హోస్ట్ గా సమంత సర్ ప్రైజ్ చేసింది. సమంత సామ్ జామ్ మొదటి సీజన్ ఎనిమిది ఎపిసోడ్స్ తో సత్తా చాటింది. 

ఇక సామ్ జామ్ సీజన్ 1 పూర్తి కాగా సీజన్ 2 త్వరలోనే స్టార్ట్ అవుతుందని అన్నారు. కాని చూస్తుంటే సామ్ జామ్ సీజన్ 2 ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. సామ్ జామ్ షోకి మంచి రెస్పాన్స్ వచ్చినా సరే ప్రస్తుతం సీజన్ 2 మొదలు పెట్టే ఆలోచన వారికి లేదట. ప్రస్తుతం సమంత గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.