జనతా గ్యారేజ్ స్పూఫ్ తో ఆలీ

హిట్ సినిమాల స్పూఫ్ కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించే అల్లరి నరేష్ ప్రస్తుతం ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా చేస్తున్నాడు. జి.నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను బడా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా కొత్త కథలతో ట్రై చేస్తున్నా హిట్ కు దూరంగా ఉన్న అల్లరోడు తనకు అచ్చొచ్చిన స్పూఫ్ కామెడీతోనే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లరి నరేష్ సెల్ఫీ రాజా ఇది వరకు సినిమాల కన్నా కాస్త బెటర్ రిజల్ట్ ఇచ్చింది.

అందుకే మరోసారి తన సినిమాలో స్పూఫ్ కామెడీ చేయిస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ సినిమాలో స్పూఫ్ చేసే సినిమా రీసెంట్ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక నరేష్ స్పూఫ్ లో ఆలి భజన్ లాల్ పాత్రలో కనిపిస్తున్నాడు. దానికి సంబంధించిన పిక్ ఒకటి నాగేశ్వర రెడ్డి తన ట్విట్టర్ లో పెట్టారు.

హిట్ సినిమా ఫార్ములాతో స్పూఫ్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల్లరి నరేష్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఇన్నాళ్లు పెద్ద సినిమాలను నిర్మించిన భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీగానే తెరకెక్కిస్తున్నారట. మరి ఈ దెబ్బతో అల్లరోడికి అదిరిపోయే హిట్ వచ్చేస్తుందేమో చూడాలి.