మహేష్ సినిమాలో నయనతార కూడా..!

సూపర్ స్టార్ మహేష్-మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో మహేష్ లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న మురుగదాస్, సినిమాలో చాలా స్పెషల్ అప్పియరెన్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడట. ఇక ఆ క్రమంలోనే సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో కోలీవుడ్ సూపర్ బ్యూటీ నయనతారాను అడుగుతున్నారని టాక్. నయన్ సినిమాలో ఉంటే కోలీవుడ్లో అదో ప్లస్ పాయింట్ అని మురుగదాస్ నమ్మకం.

గజిని సినిమాలో కూడా నయన్ కు స్పెషల్ రోల్ ఇచ్చి ఆ సినిమా హిట్ లో తనని భాగం చేశాడు. ఆ కృతజ్ఞతతో మహేష్ సినిమా గురించి అడగ్గానే ఓకే చెప్పిందట నయనతార. మహేష్ తో మొదటిసారి కలిసి నటిస్తున్న నయన్, ఈ సినిమాలో నటించడం క్రేజీ థింగ్ అని చెప్పాలి. అయితే మొదట ఈ రోల్ మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో కాని నమ్రత తాను సినిమాల్లో నటించేది లేదు అని చెప్పేసింది.

సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయిన ఈ పాత్రలో నయన్ ను సెలెక్ట్ చేయడం మురుగదాస్ ఈ సినిమాను ఎలాగైనా సూపర్ హిట్ కొట్టేందుకు ప్లాన్ లో భాగమే అనిపిస్తుంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ టీజర్ కోసమే స్పెషల్ గా షూటింగ్ జరిపినట్టు టాక్. మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.