
జీతు జోసెఫ్ డైరక్షన్ లో మళయాళంలో సూపర్ హిట్టైన సినిమా దృశ్యం. మోనల్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, తమిళ్ లో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ నటించారు. ఇక లేటెస్ట్ గా జీతు జోసెఫ్ డైరక్షన్ లో దృశ్యం 2 సినిమా కూడా రిలీజైంది. మోనల్ లాల్ నటించిన ఈ సినిమా డైరెక్ట్ గా అమేజాన్ ప్రైం లో రిలీజైంది.
దృశ్యం లానే పార్ట్ 2 కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే అలా దృశ్యం 2 హిట్ టాక్ తెచ్చుకుందో లేదో వెంటనే ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనేశారు సురేష్ బాబు. సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. జీతు జోసెఫ్ డైరక్షన్ లో తెలుగులో దృశ్యం 2 రాబోతుంది. వెంకటేష్ ఈ సినిమాకు సైన్ చేశారని తెలుస్తుంది. మార్చ్ నుండే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన డైరక్టర్ జీతు జోసెఫ్ తన సోషల్ బ్లాగుల్లో పెట్టారు.