
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమాకు రకరకాల టైటిల్స్ వినపడ్డాయి. ఈ సినిమాకు టైటిల్ గా మోనార్క్, డేంజర్ టైటిల్స్ పెట్టాలని అనుకున్నారు. ఫైనల్ గా ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అని ఫిక్స్ చేసినట్టు టాక్. సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ చేసినట్టు తెలుస్తుంది. ఒకటి అఘోరా లుక్ తో ఉంటుందని టాక్.
ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సిం హా, లెజెండ్ లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ తర్వాత గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో బాలయ్య బాబు అదరగొట్టాలని చూస్తున్నాడు. బిబి 3 అంటూ వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక త్వరలో ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా టీజర్ కూడా వస్తుందని తెలుస్తుంది.