
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్నారని తెలిసిందే. ఇద్దరు రియల్ ఫ్రీడం ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో చరణ్, తారక్ నటిస్తున్నారు. అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన రెండు టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. చిత్రయూనిట్ మొత్తం డే అండ్ నైట్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఫిల్మ్ సిటీలో జరుపుకుంటున్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ స్పాట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ విజిట్ చేశారట. అయ్యప్పనుం కోషియం రీమేక్ షూటింగ్ గ్యాప్ లో దగ్గరలో జరుగుతున్న ట్రిపుల్ ఆర్ షూటింగ్ స్పాట్ కు వెళ్లారట పవన్. పవన్ రాకతో ఆర్.ఆర్.ఆర్ సెట్ అంతా సందడిగా మారిందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, చరణ్ లను కూడా పవన్ కలిసినట్టు తెలుస్తుంది.