
యువ హీరో నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ గా వస్తున్న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను జూన్ 11న రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించారు. ఇందుకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. నితిన్ 30వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై నితిన్ ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.
ఇక నితిన్ అందాదున్ సినిమా రీమేక్ ను మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ భామ నభా నటేష్, తమన్నాలు నటిస్తున్నారు. ఫిబ్రవరి 26న నితిన్ చెక్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత మార్చ్ 26న రంగ్ దే అంటూ రాబోతున్నాడు నితిన్. ఈ రెండు సినిమాలతో పాటుగా అందాదున్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కూడా జూన్ 11న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.