రామ్ ను వదిలి ఎన్టీఆర్ ను పట్టాడా..!

పటాస్, సుప్రీం సినిమాలతో హిట్లు అందుకున్న డైరక్టర్ అనీల్ రావిపూడి తన తరవాత సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం హైపర్ సినిమా చేస్తున్న రామ్ అనిల్ తో మూవీకి సై అన్నాడు. అయితే ఏమైందో ఏమో కాని రామ్ అనిల్ సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టి కరుణాకరణ్ తో సినిమాకు ఫిక్స్ అయ్యాడు. రామ్ ఇచ్చిన షాక్ కు దిమ్మతిరిగిన అనిల్ ఇప్పుడు తన దృష్టి జూనియర్ ఎన్.టి.ఆర్ మీద పెట్టాడట. ఇప్పటికే జనతా గ్యారేజ్ హిట్ తో చాలాకాలం తర్వాత అభిమానుల ఆకలి తీర్చిన జూనియర్ ఇకనుండి ప్రయోగాలకు పెద్ద పీటవేస్తున్నాడు.

ఆ క్రమంలోనే పూరి, వక్కంతం వంశీలతో కథా చర్చల్లో ఉన్న తారక్ ఇప్పుడు అనిల్ రావిపూడితో కూడా స్క్రిప్ట్ డిస్కషన్స్ మొదలు పెట్టాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం రామ్ కు అనుకున్న కథతోనే జూనియర్ తో సినిమాకు సిద్ధమయ్యాడట అనిల్. తీసిన మొదటి రెండు సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవడంతో అనిల్ సినిమా అంటే అంచనాలు బాగానే ఉన్నాయి. రామ్ సినిమా నుండి అనిల్ ఎక్సిట్ కు మరో కారణం నిర్మాత స్రవంతి రవికిశోర్ తన రెమ్యునరేషన్ విషయంలో అడిగినంత ఇవ్వనన్నాడట అందుకే అనిల్ తనంతట తానే ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేశాడట.

మరి రామ్ ను వదిలి తారక్ కు పట్టుకున్న అనిల్, జూనియర్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. అయితే తారక్ తో సినిమా ఉన్నా సరే అది ఓ సినిమా తర్వాత ఉండే అవకాశం ఉందని అంటున్నారు.