
యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కుప్పిల డైరక్షన్ లో వస్తున్న సినిమా పాగల్. ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నారని తెలుస్తుంది. సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. పాగల్ టీజర్ సినిమా టైటిల్ కు తగినట్టుగానే హీరో క్యారక్టైజేషన్ ఉంది.
ఇంకా చెప్పాలంటే ఈ టైటిల్.. ఈ పాత్ర విశ్వక్ సేన్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. పాగల్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేసినా అసలు కథ ఏంటన్నది పెద్దగా రివీల్ చేయలేదు. లవర్ కోసం పాగల్ గా మారిన ఓ ప్రేమికుడి కథగా వస్తున్న ఈ పాగల్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు.