నాంది ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత..?

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరక్షన్ లో వస్తున్న సినిమా నాంది. కెరియర్ లో మ్యాక్సిమం కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ ఒకటి రెండు ప్రయత్నాలు సీరియస్ గా చేశాడు. అది కూడా వేరే హీరోల సినిమాల్లో సీరియస్ రోల్స్ చేశాడు. అయితే అల్లరి నరేష్ ఇప్పుడు తను హీరోగా ఫుల్ లెంగ్త్ రోల్ లో సీరియస్ గా కనిపించాడు.

నాంది సినిమాలో న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా నరేష్ అదరగొట్టాడని తెలుస్తుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకోగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం చాలా తక్కువగా జరిగినట్టు తెలుస్తుంది. ఈమధ్య కెరియర్ లో పూర్తిగా వెనకపడ్డ అల్లరి నరేష్ జనవరిలో వచ్చిన బంగారు బుల్లోడు కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ క్రమంలో నాంది సినిమాకు కోటిన్నర మాత్రమే బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. నైజాం 1 కోటి ఆంధ్రా, సీడెడ్ కలిపి 50 లక్షలు మొత్తం 1.50 కోట్లతో నాంది రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 2 కోట్లు వసూళు చేస్తే చాలు. అల్లరి నరేష్ సూపర్ హిట్ సినిమాలు 20 కోట్లు వసూళు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ఫాం లో లేని అల్లరి నరేష్ 2 కోట్లు సాధిస్తే సూపర్ హిట్ కొట్టినట్టే. నాందిపై నరేష్ భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.