'బేబమ్మ' మనసులు గెలిచేసింది..!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తన నటనతోనే కాదు తన ప్రవర్తనతో మెప్పిస్తుంది. ఉప్పెన ఈ రేంజ్ లో హిట్టైనా సరే ఆ హిట్ తాలూఖా గర్వం ఎక్కడ కనిపించట్లేదు అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది.

ఇక దశాబ్ధాలుగా తెలుగు సినిమాల్లో నటిస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ కూడా తెలుగులో మాట్లాడటానికి వెనుకాడుతారు కాని మొదటి సినిమాతోనే కృతి శెట్టి తెలుగు నేర్చుకుని మరి మాట్లాడుతుంది. సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తున్న కృతి శెట్టిని చూసి తెలుగు ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

ఉప్పెనతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి తెలుగు ప్రేక్షకుల్లో బేబమ్మ పాత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. రీసెంట్ గా జరిగిన ఉప్పెన సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఎంచక్కా హాఫ్ సారీఎలో రావడమే కాకుండా తన ముద్దు ముద్దు తెలుగు మాటలతో ప్రేక్షకుల మనసులు గెలిచేసింది కృతి శెట్టి.