కనిపించేంత అమాయకుడు కాదు.. ఉప్పెన సెలబ్రేషన్స్ లో చరణ్ కామెంట్స్..!

ఉప్పెన సినిమా సూపర్ హిట్ అవడంతో సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ బుధవారం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా చరణ్ వచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో తను కూడా పాలుపంచుకున్నాడు చరణ్. ఈ క్రమంలో సినిమాకు కష్టపడిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్థావించారు చరణ్. అంతేకాదు వైష్ణవ్ హీరోగా చేస్తారని అన్నప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు తమ సపోర్ట్ అందించారని అన్నారు.

మెగాస్టార్ ఏ కథతో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఉండాలని కథలు వున్నారు.. బాబాయ్ పవన్ కళ్యాణ్ వైష్ణవ్ ను ఫారిన్ పంపించి మార్షల్ ఆర్ట్స్ నేర్పించారని అన్నారు. నా సినిమా కథ కూడా అంతగా వినని నాన్న చిరంజీవి గారు వైష్ణవ్ తేజ్ ఉప్పెన కథను నాలుగు సార్లు విన్నారని.. దాదాపు రెండు మూడు గంటలు కేటాయించారని అన్నారు. 

వైష్ణవ్ తేజ్ తొలి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడని.. అతను కనిపించేంత అమాయకుడు కాదని.. తెలివైన వాడని.. అలాంటి వారికి ఈ సక్సెస్ చాలా కామన్ అని అన్నారు. ఇక ఈ సినిమాతో కుర్రాళ్లని మెప్పించింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చిందని అన్నారు. ఇలాంటి మంచి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు తన శుభాకాంక్షలు తెలిపారు చరణ్.