
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. యువత మెచ్చిన ప్రేమకథగా ఈ సినిమా మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టింది. నాలుగవ రోజు నుండి ఉప్పెనకు వస్తున్న వసూళ్లన్ని లాభాలే అని తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా తమకు ఇంత మంచి హిట్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు ఉప్పెన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
బుధవారం రాజమండ్రిలో ఉప్పెన బ్లాక్ బస్టర్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు స్పెషల్ ఎట్రాక్షన్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిలిచారు. అయ్యప్ప మాలతో ఉన్న చరణ్ ఉప్పెన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కు గెస్ట్ గా వచ్చారు. సెలబ్రేషన్స్ లో భాగ్నగా దర్శకుడు బుచ్చి బాబు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తనపై ఇంత నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు చిరు సర్ ఈ సినిమాని ఓకే చేయడం గొప్ప విషయమని.. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యాడని అన్నారు బుచ్చి బాబు. అందుకే ఉప్పెన సినిమాను ఆయనకు అంకితం చేస్తున్నా అని అన్నారు బుచ్చి బాబు.
ఇక తనకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కు.. తన గురువు సుకుమార్ కు ధన్యవాదాలు తెలిపాడు బుచ్చి బాబు. ఈ సినిమా కథ చిరు సర్ కి వినిపించడానికి చరణ్ గారి ద్వారానే వెళ్లానని చెప్పాడు.