ఉప్పెన క్రేజ్.. వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమాకు భారీ డిమాండ్..!

ఉప్పెన సూపర్ హిట్ అవడంతో వైష్ణవ్ తేజ్ కు సూపర్ క్రేజ్ వచ్చింది. బుచ్చి బాబు డైరక్షన్ లో వచ్చిన ఉప్పెన సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజై సెన్సేషనల్ హిట్ అయ్యింది. మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టిన ఈ సినిమా వసూళ్లతో బీభత్సం సృష్టిస్తుంది. డైరక్టర్, హీరో, హీరోయిన్ ఇలా అందరు కొత్తవారైనా సరే సినిమా ప్రేక్షకులను రీచ్ అవడంతో సక్సెస్ అయ్యింది.

ఇక వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన సక్సెస్ అవడంతో తను చేసిన రెండో సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడ్డది. క్రిష్ డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలం నవల ఆధారంగా సినిమా చేశాడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను ముందు ఓటిటి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని వైష్ణవ్ తేజ్ ఉప్పెన సూపర్ హిట్ అవడంతో క్రిష్ సినిమా థియేట్రికల్ బిజినెస్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.