వైష్ణవ్ తేజ్ తో నాగార్జున..!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో ఎవరు ఊహించని హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆల్రెడీ క్రిష్ డైరక్షన్ లో సినిమా పూర్తి చేసి ఉన్నాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతుందని టాక్. ఇదిలాఉంటే వైష్ణవ్ తేజ్ థర్డ్ మూవీని అన్నపూర్ణ బ్యానర్ లో ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా వస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాకు దర్శకుడు ఎవరు.. కథ ఎలా ఉండబోతుంది.. హీరోయిన్ ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు. హీరోగా సినిమాలు చేస్తూనే యువ హీరోలతో సినిమాలు నిర్మించడం నాగార్జునకు అలవాటే. ఓ పక్క అక్కినేని యువ హీరోలు అఖిల్, నాగ చైతన్యలు కూడా తమ సినిమాలతో కెరియర్ బిజీలో ఉన్నారు. అక్కినేని బ్యానర్ లో మెగా హీరో సినిమా.. ఇంట్రెస్టింగ్ కాంబోగా వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.