
పదమూడేళ్ల తర్వాత హిట్ మజా ఎంజాయ్ చేస్తున్నానని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ సందర్భంగా సక్సెస్ మీట్ లో ఎమోషనల్ గా మాట్లాడాడు ఎన్.టి.ఆర్. సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ సినిమా గురించి రకరకాల రిపోర్టులు వచ్చాయని.. కాని శివ మీద కథ మీద పెట్టుకున్న నమ్మకం తప్పదని.. అందుకే చివరగా ప్రేక్షక దేవుళ్లు ఈ ఘన విజయాన్ని అందించారని అన్నారు. సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ అమ్మానాన్నల పుట్టినరోజు కానుకగా ఇచ్చానని అన్నారు.
ఈ సినిమా సక్సెస్ ను పూర్తిగా ఆస్వాదిస్తున్న జూనియర్ తనకు ఇంతకు మించి కావాల్సింది ఏది లేదని అన్నారు. మీ కళ్లల్లో ఆనందం చూడడానికి ఇక నుండి ఇలాంటి సినిమాలే తీస్తా ఇంత గొప్ప సినిమాను ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకు ఆజన్మాంతం ఋణపడి ఉంటానని అన్నారు జూనియర్. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఆయన చల్లని చూపులు మన మీద ఉన్నాయని అలానే ఉండాలని అన్నారు.
జనతా గ్యారేజ్ వల్ల మీ అందరి మొహాళ్లో ఆనందాన్ని చూడగలిగానని.. బ్రతికినంత కాలం మిమ్మల్ని ఆనందింప చేయడానికే సినిమాలు చేస్తుంటానని అన్నారు ఎన్.టి.ఆర్.