
కింగ్ నాగార్జున కొత్త సినిమా పూజా కార్యక్రమాలు మంగళవారం సికిందరాబాద్ గణపతి ఆలయంలో జరిగాయి. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నారాయణ్ దాస్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ముహుర్త కార్యక్రమాలకు తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అటెండ్ అయ్యారు.
ప్రస్తుతం సోలమన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా ప్రవీణ్ సత్తారు మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా చేస్తున్నారని తెలుస్తుంది. మన్మథుడు 2 ఫ్లాప్ తో ఫాం కోల్పోయిన నాగార్జున ఓ పక్క బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర సినిమాతో పాటుగా ప్రవీణ్ సత్తారు మూవీని ఫిక్స్ చేసుకున్నాడు. వైల్డ్ డాగ్ హిట్టు పడితే మాత్రం మళ్లీ నాగార్జున సూపర్ ఫాం లోకి వచ్చే అవకాశం ఉంటుంది.