ఎం.ఎస్ ధోని నటుడు ఆత్మహత్య..!

బాలీవుడ్ లో మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెస్ ధోని సినిమాలో నటించిన సందీప్, భార్యతో ఉన్న గొడవల వల్ల సూసైడ్ నోట్ రాసి మరి సూసైడ్ చేసుకున్నారు. ఎమ్మెస్ ధోని సినిమాలో కీలక పాత్రలో సందీప్ ఆత్మహత్య బాలీవుడ్ పరిశ్రమ షాక్ అయ్యేలా చేసింది. ధోని సినిమాలో మెయిన్ రోల్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సందీప్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆశ్చర్యపడేలా చేస్తుంది.


భార్యతో గొడవల వల్లే తను ఈ సూసైడ్ చేసుకుంటున్నానని లెటర్ లో రాసిన సందీప్ తన చావుకి ఎవరు కూడా తన భార్యని నిందించవద్దని కోరాడు. భార్య వల్ల మనస్థాపానికి గురైన సందీప్ ఆ బాధ నుండి బయట పడలేక సూసైడ్ చేసుకుని ఉంటాడని అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. సందీప్ మృతి పట్ల బాలీవుడ్ వర్గాల వారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.