
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న థర్డ్ క్రేజీ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొడతాడని తెలుస్తుంది. కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో రష్మిక కాకుండా మరో హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ భామ మేఘా ఆకాష్ బన్నీ పుష్పలో నటిస్తుందట. సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ఉంటుందట. ఆ పాత్రకు జోడీగా మేఘా ఆకాష్ నటిస్తుందని టాక్. తెలుగులో నితిన్ సరసన లై, ఛల్ మోహన్ రంగ సినిమాల్లో నటించింది మేఘా ఆకాష్.
చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో అమ్మడికి ఎవరు పట్టించుకోలేదు. ఫైనల్ గా పుష్ప సినిమాలో మేఘా ఆకాష్ కు లక్కీ ఛాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా అయినా మేఘా ఆకాష్ కు లక్ కలిసి వచ్చేలా చేస్తుందో లేదో చూడాలి.