ఉప్పెనలాంటి వసూళ్లు.. 3 రోజుల్లో లాభాలు..!

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చి బాబు డైరక్షన్ లో వచ్చిన సినిమా ఉప్పెన. లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేమకథగా వచ్చిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల నటనతో పాటుగా సినిమాలో రాయణం పాత్ర చేసిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా బాగా నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా మొదటి రోజు మొదటి టాక్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ రిపీటెడ్ గా ఈ మూవీ చూస్తున్నారు. ఉప్పెన సినిమా మొదటి రోజు 9.17 కోట్లు, రెండవ రోజు 6.86 కోట్ల షేర్ రాబట్టగా సండే 8.2 కోట్లు వసూళ్లు రాబట్టింది.

తెలుగు రెండు రాష్ట్రాల్లో 19 కోట్ల బిజినెస్ తో రిలీజైన ఉప్పెన తొలి మూడు రోజుల్లోనే 24.23 కోట్లు వసూళ్లను రాబట్టింది. 3వ రోజు 8 కోట్ల షేర్ రాబట్టిన టాలీవుడ్ స్టార్ హీరోల సరసన వైష్ణవ్ తేజ్ చేరాడు. ఇదో రకంగా మొదటి సినిమాకే వైష్ణవ్ తేజ్ సాధించిన రికార్డ్ అని చెప్పొచ్చు. 3 రోజుల్లోనే ఉప్పెన లాభాల బాట పట్టింది. సినిమా జోరు చూస్తుంటే సుకుమార్ చెప్పినట్టుగా 100 కోట్లు రీచ్ అయ్యేలా ఉందని అనుకుంటున్నారు.