
స్టార్ సినిమా అంటే స్క్రీన్ నేం కంపల్సరీ.. కొద్దిపాటి క్రేజ్ వచ్చిన ప్రతి హీరో తమలో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీతో ఆ స్క్రీన్ నేం పెట్టుకుంటారు..ప్రస్తుతం న్యాచురల్ స్టార్ గా మారినప్పటి నుండి నాని న్యాచురల్ నటనకు సూపర్ హిట్లు కొడుతూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు సునీల్ వంతు వచ్చింది. కృష్ణాష్టమికి గోల్డెన్ స్టార్ అని ట్రై చేసినా అది వర్క్ అవుట్ కాలేదు అందుకే ఈ మధ్య రిలీజ్ అయిన జక్కన్నకు ఏ స్క్రీన్ నేం లేకుండా కానిచ్చేశాడు సునీల్.
అయితే ప్రస్తుతం 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాకు మాత్రం సునీల్ కు డ్యాన్సింగ్ స్టార్ అనే స్క్రీన్ నేం ఇచ్చేస్తున్నారట. తెలుగు హీరోల్లో డ్యాన్సులతో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసే హీరోల్లో సునీల్ ఒకరని చెప్పాలి. స్టార్స్ అంతా ఓ రేంజ్ స్టెప్పులేస్తుంటే సునీల్ కూడా వారికి ధీటుగా తన డ్యాన్సులతో అదరగొట్టేస్తాడు. ఏకంగా సునీల్ డ్యాన్సుల గురించి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్న విషయం తెలిసిందే. అందుకే డ్యాన్సింగ్ స్టార్ గా సునీల్ ను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
వీరు పోట్ల డైరెక్ట్ చేస్తున్న ఈడు గోల్డ్ ఎహే సినిమా ఆధ్యంతం నవ్వుల ఝల్లులను కురిపిస్తుందట. ఇక సినిమాలో హీరోయిన్స్ సుష్మా రాజ్, రిచా పనయ్ లు కూడా పోస్టర్స్ లోనే కేకపెట్టించేస్తున్నారు. కెరియర్ లో హిట్ కోసం తెగ సతమతమవుతున్న సునీల్ కు ఈ డ్యాన్సింగ్ స్టార్ స్క్రీన్ నేం తో వస్తున్న ఈడు గోల్డ్ ఎహే సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.