రాధే శ్యామ్ టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. రాధే శ్యామ్ నుండి ఇప్పటివరకు పోస్టర్స్ మాత్రమే రాగా లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ కు డేట్ లాక్ చేశారు.

ఈ ప్రేమికుల రోజు రాధే శ్యామ్ టీజర్ రాబోతుంది. వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న ఉదయం 9.18 గంటలకు రిలీజ్ ఫిక్స్ చేశారు. విక్రమాదిత్య, ప్రేరణ పాత్రలతో పిరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా వస్తుంది. సాహోతో అంచనాలను అందుకోని ప్రభాస్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందో లేదో చూడాలి.