'ఒకసారి ఇటు చూడవే' అంటున్న చైతు..!

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆ సినిమా తర్వాత కూడా అక్కినేని కాంపౌండ్ లోనే మరో సినిమా కమిట్ అయ్యాడు. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కళ్యాణం, నిన్నే పెళ్లాడతా అనే టైటిల్స్ పెడుతున్నారని ప్రచారం జరిగింది. కాని ఫైనల్ గా ఈ సినిమాకు 'ఒకసారి ఇటు చూడవే' అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ, ఈ సినిమాను కూడా అదే క్రమంలో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు.

రకుల్ ప్రీత్ సింగ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో స్టార్ట్ అవనున్న ఈ సినిమా పట్ల చైతు కూడా ఉత్సాహంగా ఉన్నాడట. సినిమా మొత్తం నిన్నే పెళ్లాడతా రేంజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. అసలే రొమాంటిక్ టచ్ తో సినిమా సూపర్ హిట్ చేసుకునే సత్తా చైతుకి బాగా ఉంది. ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ రీమేక్ ప్రేమమ్ రిలీజ్ కు రెడీ అవుతుండగా గౌతం మీనన్ డైరక్షన్లో తెరకెక్కించిన 'సాహసం శ్వాసగా సాగిపో' కూడా రిలీజ్ కు సిద్ధమైంది.

ముందు ప్రేమమ్ ఆ తర్వాత సాహసం రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక చైతు న్యూ టైటిల్ ఒకసారి ఇటు చూడవే అని అందులో నటిస్తున్న రకుల్ తో అంటాడా లావణ్యతో అంటాడా అన్నది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.