
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. సినిమాను ఎక్కడ కాంప్రైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. మొన్నటివరకు మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో స్టార్ కమెడియన్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నట్టు లీక్ అయ్యింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో స్టార్ కమెడియన్ సునీల్ విలన్ గా చేస్తున్నాడట. సినిమాలో మెయిన్ విలన్ ఎవరన్నది తెలియదు కాని సునీల్ కూడా నెగటివ్ రోల్ తో సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది. స్టార్ కమెడియన్ గా సునీల్ సూపర్ ఫాం లో ఉన్నప్పుడు సడెన్ గా హీరోగా టర్న్ తీసుకున్నాడు. ఈమధ్య విలన్ గా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో సినిమాలో విలన్ గా నటించాడు సునీల్. ఇక ఇప్పుడు బన్నీ పుషలో విలన్ గా సత్తా చాటాలని చూస్తున్నాడు. పాన్ ఇండియా మూవీలో సునీల్ నెగటివ్ రోల్ సినిమాకు ఎలా ప్లస్ అవుతుందో చూడాలి. ఇదేకాదు ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబో మూవీలో కూడా సునీల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.