'ఉప్పెన'కు పవన్ కళ్యాణ్ రివ్యూ

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆల్రెడీ ప్రీమియర్ షోస్ లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినట్టు తెలుస్తుంది. సినిమా చూసిన సెలబ్రిటీస్ ఆల్రెడీ సినిమా సూపర్ హిట్ అనేస్తున్నారు. అయితే ఉప్పెన సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రివ్యూ ఇచ్చేశారు. ప్రేక్షకులకు ఇలాంటి ప్రేమకథలు ఎప్పుడూ నచ్చుతాయని.. వారి హృదయాల్లో గుర్తుండిపోయే సినిమాగా ఉప్పెన ఉంటుందని అన్నారు.

ఉప్పెన రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా పవర్ స్టార్ తో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కథ విన్న పవన్ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించారు. రిలీజ్ కు ముందే సూపర్ పాజిటివ్ బజ్ తో వచ్చిన ఉప్పెన ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.

ఈ సినిమాకు డైరక్టర్ బుచ్చి బాబే అయినా మొత్తం నడిపించింది మాత్రం సుకుమార్. సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించారు. సినిమాలో ఆయన పాత్ర హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని తెలుస్తుంది.