
కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ ఫాంలో ఉంది. టాలీవుడ్ లో స్టార్ సినిమా అంటే హీరోయిన్ గా మొదటి రెండిటి లిస్ట్ లో తన పేరు ఉండేలా చేసుకుంది రష్మిక. కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన ఈ అమ్మడు ఛలో, గీతా గోవిందం సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ హిట్స్ తో అమ్మడు సినిమాలో ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఏర్పరచుకుంది.
అయితే వరుస ఛాన్సులు.. డేట్స్ ఖాళీలేని షెడ్యూల్స్ ఇవన్ని చూసి రష్మిక ఒక సినిమాకు 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని మీడియాలో రాస్తున్నారు. అయితే ఈ వార్తలు అటు ఇటు చేరి రష్మిక చెవిన పడ్డాయి. అయితే దీనికి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది రష్మిక. తనకు రెమ్యునరేషన్ 2 కోట్లు అన్నది కలగానే ఉందని అది నిజమైతే బాగుండని అంటుంది. అంటే అమ్మడు ఇంకా కోటి కోటిన్నర దగ్గరే ఉందని ఆమె చెప్పిన దాన్ని బట్టి అర్ధమవుతుంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ పుష, తమిళంలో కార్తీ హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమాల్లో నటిస్తుంది.